వ‌రుణ్ ని చూస్తే.. అసూయ‌గా అనిపిస్తోంద‌ట‌!!

By iQlikMovies - December 19, 2018 - 09:30 AM IST

మరిన్ని వార్తలు

మెగా ఫ్యామిలీలో ఒకొక్క‌రిదీ ఒక్కో శైలి. మాస్ హిట్ల‌తో... రామ్‌చ‌ర‌ణ్ దూసుకెళ్తుంటే, క్లాసీ క‌థ‌ల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు వ‌రుణ్ తేజ్‌. ఎవ‌రి శైలి వాళ్ల‌ది, ఎవ‌రి దారి వాళ్ల‌ది. అయితే... వ‌రుణ్ తేజ్ ని చూస్తుంటే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి అసూయ‌గా అనిపిస్తోంద‌ట‌. ఈ విష‌యాన్ని... రామ్ చ‌ర‌ణ్ స్వ‌యంగా సెల‌విచ్చాడు. వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'అంత‌రిక్షం' ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హాజ‌ర‌య్యాడు. ఈ వేడుక‌లోనే ఈ విష‌యం చెప్పాడు చ‌ర‌ణ్‌. 

 

''వ‌రుణ్ నన్ను చాలాసార్లు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాడు. కొన్ని సార్లు జెల‌సీగా కూడా అనిపిస్తుంటుంది. ఈ సినిమా ట్రైల‌ర్ చూసి వ‌రుణ్‌పై చాలా అసూయ ప‌డ్డాను. ఈమ‌ధ్య కాలంలో నేనెంతో ఇష్ట‌ప‌డిన ట్రైల‌ర్ ఇది. విజ‌న‌రీ ఉన్న ట్రైల‌ర్ ఇది. గొప్ప బృందం ఈ సినిమాకి ప‌ని చేసింది. ఎంతో అదృష్టం ఉంటే త‌ప్ప ఇలాంటి సినిమాలో అవ‌కాశం రాదు. త‌న అంకిత‌భావం, ఆలోచ‌న తీరు చాలా బాగుంటాయి. అవే మంచి వ్య‌క్తుల్ని మంచి సినిమాల ద‌గ్గ‌ర‌కు చేరుస్తాయి. పాజిటీవ్ గా ఆలోచించే ప్ర‌తి ఒక్క‌రికీ దేవుడు మంచే చేస్తాడు'' అన్నాడు చ‌ర‌ణ్‌.

 

ప‌నిలో ప‌నిగా సంక‌ల్ప్ రెడ్డి ప‌నిత‌నాన్ని కూడా మెచ్చుకున్నాడు చ‌ర‌ణ్‌. రాజ‌మౌళి, క్రిష్‌, సుకుమార్ లాంటి గొప్ప ద‌ర్శ‌కుల జాబితాలో సంక‌ల్ప్ చేరాల‌ని, వాళ్ల‌కంటే గొప్ప విజ‌యాల్ని అందుకోవాల‌ని ఆకాంక్షించాడు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 21న విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. లావ‌ణ్య త్రిపాఠీ, అతిథి రావ్ హైద‌రీ ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా న‌టించారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS