విలక్షణమైన చిత్రాల్ని ఎంచుకుంటూ, యంగ్ హీరోల్లో తనదైన విలక్షణతను చాటుకుంటున్న నిఖిల్, తన కొత్త సినిమా 'ముద్ర' విషయంలో ఒకింత ఎక్కువ టైన్షన్ పడుతున్నాడట. దానిక్కారణం, సరైన రిలీజ్ డేట్ దొరక్కపోవడమే. ఈ డిసెంబర్ నెలలోనే 'ముద్ర' ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న ప్రచారం గతంలో జరిగింది. కానీ, ఈ నెలలో నిఖిల్‌కి డేట్ దొరికేలా కన్పించడంలేదు.
డిసెంబర్ 28న 'ముద్ర' రావచ్చన్న ప్రచారమైతే జరుగుతోందిగానీ, ఆ దిశగా సినిమా యూనిట్ ఇంతవరకు ఎలాంటి ప్రమోషన్ కార్యక్రమాలూ చేపట్టడంలేదంటే, సినిమా విడుదల ఇప్పట్లో లేనట్టేనని అనుకోవాలి. డిసెంబర్ దాటితే, సంక్రాంతి కష్టం. జనవరి అంతా కూడా డేట్ దొరికే అవకాశం లేదు. మళ్ళీ ఫిబ్రవరిలోనే నిఖిల్ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి వుంటుందేమో. అన్నట్టు, ఈ సినిమాలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కన్పించబోతున్నాడు.
సినిమా స్టిల్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి కూడా. సినిమాపై మంచి బజ్ వున్నా, సరైన రిలీజ్ డేట్ దొరక్క ఈ యంగ్ హీరో సినిమా ముందుకీ, వెనక్కీ అన్నట్టు గందరగోళంలో పడిపోవడం పట్ల సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా, హిట్టు కొట్టామా లేదా.? అన్నంత కాన్ఫిడెన్స్‌తో నిఖిల్ వున్నాడట. ఎప్పుడు రిలీజ్ అయినా సినిమా ఖచ్చితంగా హిట్ కొడతాననే ధీమా నిఖిల్‌లో వుంటే, కాస్త ఆలస్యమైనా.. ఆ ఆలస్యం కూడా మంచిదే అవుతుందేమో.!