చ‌ర‌ణ్ కోసం క్లాస్ టైటిల్‌?

By iQlikMovies - October 07, 2018 - 14:27 PM IST

మరిన్ని వార్తలు

రామ్ చ‌ర‌ణ్ - బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి టైటిల్ ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. `స్టేట్ రౌడీ` అనే టైటిల్ ఆమ‌ధ్య చ‌క్క‌ర్లు కొట్టింది. ఇప్పుడు మ‌రో టైటిల్ వినిపిస్తోంది. అదే.. `విన‌య విధేయ రామ‌`. 

 

నిర్మాత డివివి దాన‌య్య ఈ టైటిల్‌ని రిజిస్ట‌ర్ చేయించారు. దాంతో.. ఇది చ‌ర‌ణ్ కోస‌మే అని అభిమానులు ఫిక్స‌యిపోయారు. బోయ‌పాటి `మాస్‌` టైటిళ్ల‌ని పెట్ట‌డంలో సిద్ద‌హ‌స్తులు. భ‌ద్ర నుంచి స‌రైనోడు వ‌ర‌కూ ఆయ‌న టైటిళ్ల‌న్నీ మాస్ ట‌చ్‌తోనే సాగాయి. `జ‌య జాన‌కీ నాయ‌క‌`కు మాత్రం ఆయ‌న క్లాస్ టైటిల్‌ని ఎంచుకున్నారు. ఈసారీ ఆయ‌న క్లాస్ ట‌చ్ ఉన్న టైటిల్‌కే ప్రాధాన్యం ఇచ్చిన‌ట్టు.. అందుకే `విన‌య విధేయ రామ‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది. 

ఈనెల 18న ద‌స‌రా కానుక‌గా రామ్ చ‌ర‌ణ్ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌నున్నారు. ఆ సంద‌ర్భంలోనే టైటిల్‌ని కూడా అధికారికంగా ప్ర‌క‌టిస్తారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS