రామ్ చరణ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. `RRR` పనులు దాదాపుగా పూర్తయిపోయాయి. మరో వైపు `ఆచార్య`లో తనకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ముగిసింది. ఇప్పుడు శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈలోగా మరో రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. `మళ్లీ రావా`,`జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దసరా రోజున ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆ తరవాత.. ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు చెర్రీ.
ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి స్థాయి యాక్షన్ భరితంగా ఉండబోతోంది. కేజీఎఫ్, సలార్ రెండూ యాక్షన్ కథలే. కాబట్టి చరణ్ సినిమా కూడా అదే పంథాలో సాగడం ఖాయం. మరోవైపు... గౌతమ్ తిన్ననూరి కూడా చరణ్ కోసం యాక్షన్ డ్రామా కథనే రెడీ చేశాడట. మళ్లీ రావా ఓ క్లీన్ లవ్ స్టోరీ.
జెర్సీ స్పోర్ట్స్ డ్రామా. ఇప్పుడు చరణ్ కోసం తన పంథా మార్చి.. యాక్షన్ కథని రాసుకున్నాడట. కేవలం ఒకే ఒక్క సిట్టింగ్ లో చరణ్ ఈ కథని ఓకే చేశాడని తెలుస్తోంది. ప్రస్తుతం `జెర్సీ` సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నాడు గౌతమ్. ఆ వెంటనే.. చరణ్ సినిమా పనులు మొదలెట్టేస్తాడని టాక్.