టాలీవుడ్ లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. ఈసారి సందడంతా మెగా ఇంట్లోనే. అవును... త్వరలోనే సాయిధరమ్ తేజ్ పెళ్లి కొడుకు అవతారంలో కనిపించబోతున్నాడట. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో తేజ్ ఒకడు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నాడన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఇందుకు సంబంధించి మెగా కుటుంబం నుంచి కూడా లీకులు మొదలైపోయాయి. ఇటీవల సాయిధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అపోలో ఆసుపత్రిలో చేరి, ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు.
తేజ్ డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే.. తన పుట్టిన రోజు కూడా. ఈ సందర్భంగా చాలామంది ట్విట్టర్, ఫేస్ బుక్‌లలో శుభాకాంక్షలు తెలిపారు. అల్లు శిరీష్ చేసిన ట్వీట్ తో... తేజ్ పెళ్లి వార్త తెలిసింది. బ్యాచిలర్ గా ఇదే చివరి పుట్టిన రోజుని, త్వరలోనే పెళ్లి సంగతులు చెప్పబోతున్నాడన్న అర్థంతో అల్లు శిరీష్ ట్వీట్ చేశాడు. దాంతో... తేజ్‌పెళ్లి వార్త బయటకు వచ్చింది. ఇది వరకు కూడా తేజ్ పెళ్లిపైచాలా రూమర్లు వచ్చాయి.
అయితే వాటినెప్పుడూ తేజ్ సీరియస్ గా తీసుకోలేదు. ఈసారి ఏకంగా మెగా ఇంటి నుంచే లీకులు మొదలయ్యాయి కాబట్టి, ఈ వార్త కచ్చితంగా నిజం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తేజ్ ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడు. తను షూటింగ్ కి రావడానికి మరో నెలరోజుల సమయం అయినా పడుతుంది. ఈలోగా పెళ్లి వార్తేమైనా బయటకు వస్తుందేమో చూడాలి.