'సూర్య'కి సక్సెస్‌ వచ్చేసినట్లే.!

By iQlikMovies - April 30, 2018 - 13:22 PM IST

మరిన్ని వార్తలు

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. లేటెస్టుగా జరిగిన సినిమా ఆడియో ఫంక్షన్‌కి మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ముఖ్య అతిధిగా వచ్చాడు. బన్నీ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకున్నాడు. ఈ ఫంక్షన్‌కి చరణ్‌ గెస్ట్‌గా రావడంతోనే, బన్నీ సగం సక్సెస్‌ కొట్టేశాడు. 

గత రెండు నెలలుగా టాలీవుడ్‌ని కుదిపేసిన శ్రీరెడ్డి లీక్స్‌ ఇష్యూకి సంబంధించి, పవన్‌ కళ్యాణ్‌ ఫిలిం ఛాంబర్‌లో చేసిన నిరసనకుగాను బన్నీ మద్దతు తెలపడంతో పాటు, అక్కడికి వచ్చి, పవన్‌ని మనస్పూర్థిగా ఆలింగనం చేసుకోవడంతో పవన్‌ ఫ్యాన్స్‌నీ ఇంప్రెస్‌ చేసేశాడు బన్నీ. ఇవన్నీ బన్నీ సినిమా సక్సెస్‌ అయ్యేందుకు గుడ్‌ సైన్స్‌లానే అనిపిస్తున్నాయి. ఇక సినిమాలో బన్నీ గెటప్‌, బాడీ లాంగ్వేజ్‌ అంతా డిఫరెంట్‌గా ఉండబోతోంది. సీరియస్‌ సైనికుడి పాత్రలో బన్నీ కనిపిస్తున్నాడు. బన్నీ మంచి నటుడు. మంచి డాన్సర్‌, మంచి ఎంటర్‌టైనర్‌ అంటూ చరణ్‌, బన్నీని పొగడ్తలతో ముంచెత్తేశాడు.

ఈ సినిమాతో బన్నీలోని మరో యాంగిల్‌ని చూడబోతున్నారు అంటూ 'రుద్రమదేవి'లో బన్నీ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రను తలంపుకు తీసుకొచ్చాడు. ఆ సినిమాలో గెస్ట్‌ రోల్‌ పోషించిన ఆ పాత్రకు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నాడు. అలాంటి పాత్రని ఈ సినిమాలో పూర్తి స్థాయిలో చూడబోతున్నాం. 

ఇక ఈ సినిమాతో బన్నీ ఇంకెన్ని అవార్డులు అందుకుంటాడో మీరే చూద్దురు గానీ అని చరణ్‌ అభిమానులనుద్దేశించి చెప్పాడు. లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా నాగబాబు సమర్పణలో మే 4న విడుదల కాబోతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS