'కాటమరాయుడు' సెట్స్‌లో నిర్మాత శరత్ మరార్‌తో కలిసి కనిపించాడు రామ్‌చరణ్. ఇది సినిమా నిర్మాణ సమయంలో తీసిన ఫొటో. అప్పటికే పవన్‌కళ్యాణ్‌తో మెగా కాంపౌండ్‌కి వివాదాలున్నాయనే గుసగుసలు వినవచ్చాయి. అయితే అవన్నీ ఉత్తదేనని ఈ ఫొటోతో తేలిపోయింది. ఎప్పటికప్పుడే మెగా కాంపౌండ్ గురించి నెగిటివ్‌గా చెవులు కొరుక్కోవడం పరిపాటి అయిపోయింది. అయితే అలాంటి గుసగుసలు వచ్చిన కొద్ది కాలానికే ఇలాంటివి ఏవో తారసపడుతూ అబ్బే మెగా ఫ్యామిలీ అంతా చాలా చక్కగా సన్నిహితంగా ఉంటున్నారు అని ఒప్పుకోక తప్పదు. అదే జరిగింది ఇప్పుడు కూడా. ఎల్లుండి 'కాటమరాయుడు' సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన స్టిల్స్‌లో చరణ్ - శరత్ మరార్ కాంబినేషన్‌లో ఫొటో కూడా ఉంది. అంతే కాకుండా 'కాటమరాయుడు' సెట్స్‌లో త్రివిక్రమ్ సందడి చేసిన ఫొటో కూడా బయటకు వచ్చింది. అయితే ఈ విషయంలో అభిమానులు క్లియర్‌గానే ఉన్నారు, కానీ గాసిప్స్ మాత్రం అలా అలా మెగా కాంపౌండ్‌లో రచ్చ చేస్తూనే ఉన్నాయ్. చరణ్ 'కాటమరాయుడు' సెట్‌లో సందడి చేయడంతో సెట్‌కి మరింత నిండుతనం రావడమే కాకుండా, అనవసర గాసిప్స్‌కి కూడా తెర పడిందనే చెప్పాలి.