కాటమరాయుడు ఇప్పుడు మరో కొత్త వివాదంలో చుట్టుకొంది. నిన్నా మొన్నటి వరకూ సర్దార్ గబ్బర్ సింగ్ వల్ల నష్టపోయిన డిస్టిబ్యూటర్లు ఈ సినిమాకి ఆటంకం కలిగించాలని చూశారు. ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఈ సినిమాని స్వచ్ఛందంగా బ్యాన్ చేయాలని తెలుగు ప్రేక్షకుల్ని సినీ అభిమాన సంఘాల ఐకాస అభ్యర్థిస్తోంది. భారీ వసూళ్ళు సాధించాలన్న దురాశతో కాటమరాయుడు సినిమా టికెట్ల ధరలను నాలుగైదు రెట్లు పెంచారని, అందుకోసం ప్రభుత్వాల అనుమతులు కూడా దక్కించుకొన్నారని, సామాన్య ప్రేక్షకుడికి సినిమాని దూరం చేస్తున్నారని అందుకే... ఈ సినిమాని తొలి రెండు వారాల పాటు చూడకుండా.. ఆగాలని ఐకాస అభ్యర్థిస్తోంది. అసలే కాటమరాయుడు హీట్ ఓ రేంజులో ఉంది. టికెట్ దొరికితే చాలు.. ఎంతైనా ఫర్వాలేదు అనుకొంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రేజ్ మధ్య వీళ్ల అభ్యర్థన పట్టించుకొనేదెవరు??