పుష్ప సూపర్ డూపర్ హిట్టవ్వడంతో... పుష్ప 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని అందుకోవడం కోసం సుకుమార్ కూడా తీవ్ర స్థాయిలో శ్రమిస్తున్నాడు. పుష్ప 2లో మరింతమంది స్టార్స్‌ని తీసుకురాబోతున్నాడని సమాచారం అందుతోంది. పుష్ప 1లో కనిపించని కొత్త క్యారెక్టర్లు పార్ట్ 2లో దర్శనమివ్వబోతున్నాయని సమాచారం. అందులో భాగంగానే రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడన్న వార్త నెట్టింట సందడి చేస్తోంది.
రంగస్థలంతో చరణ్‌కి మరపురాని విజయాన్ని అందించాడు సుకుమార్. తనతో మరో సినిమా చేయాలని చరణ్ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. దానికంటే ముందు.. పుష్ప 2లో చరణ్ ని గెస్ట్ రోల్ కోసం ఒప్పించాడన్నది ఇండస్ట్రీ వర్గాల టాక్. పుష్ప 2 ముగిసిన వెంటనే చరణ్‌తో సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నాడని, ఆ సినిమాలోని పాత్రకు పుష్ప 2లో చరణ్ ఎంట్రీ టీజర్ లా ఉండబోతోందని తెలుస్తోంది. నిజంగానే చరణ్ ఈసినిమాలో భాగమైతే.. పుష్ప 2 రేంజ్ మరింత పెరిగిపోవడం ఖాయం.