చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య`. కాజల్ కథానాయిక. ఇందులో రామ్ చరణ్ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ చరణ్ సెట్లో అడుగు పెట్టలేదు. ఇప్పుడు చరణ్ ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సినిమాలో చరణ్ సిద్దాగా కనిపించబోతున్నాడు. ఈ రోజు నుంచి 15 రోజుల పాటు హైదరాబాద్ లోనే ఏక ధాటిగా షూటింగ్ జరబోతోంది. చరణ్ - చిరులపై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తారు.
మరి.. చిరు ఎప్పుడు సెట్లోకి వస్తాడో ఇంకా తెలీలేదు. చరణ్ పక్కన ఓ కథానాయిక ఉండబోతోందని ప్రచారం సాగింది. ఆ పాత్రలో రష్మిక కనిపించబోతోందని చెప్పుకున్నారు. అయితే.. కథానాయిక ఎవరన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. రష్మికని ఖాయం చేశారా? మరో నాయిక కోసం వెదుకుతున్నారా? అన్నది తేలాల్సివుంది. సోనూసూద్ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వేసవి లో విడుదల కానుంది.