రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చరణ్ - ఎన్టీఆర్ మల్టీ స్టారర్‌కి రంగం సిద్ధమైనట్లే.
తాజాగా 'అరవింద సమేత..' మూడ్ నుండి బయటికి వచ్చిన ఎన్టీఆర్, ఈ తాజా ప్రాజెక్ట్‌లోని తన ఫిట్‌నెస్ కోసం ప్రయత్నాలు మొదలెట్టేశాడు. 'అరవింద.'లో ఎన్టీఆర్‌కి ఫిట్‌నెస్ ట్రైనర్‌గా పని చేసిన స్టీవ్ ల్లాయిడ్ ఈ సినిమాలోనూ ఎన్టీఆర్ కోసం పని చేస్తున్నాడు. ఈ విషయమై చర్చించేందుకే స్టీవ్, దర్శకుడు రాజమౌళిని కలిశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చరణ్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ఆల్రెడీ దర్శకధీరుడు రాజమౌళి ఓ ప్లానింగ్‌తో ఉన్నాడు.
ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలెట్టేశాడు. ఇంతకు ముందే చరణ్ - ఎన్టీఆర్ గెటప్స్‌పై టెస్ట్ షూట్స్ కూడా జరిగాయి. మరోవైపు చరణ్ ఫిట్‌నెస్ కోసం ఆల్రెడీ ఓ టీమ్ పని చేస్తోంది. ఆ టీమ్ కూడా త్వరలోనే రాజమౌళిని కలవబోతోందట. ప్రస్తుతం చరణ్ - బోయపాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రాజమౌళి అండ్ టీమ్‌లో జాయిన్ కానున్నాడు. అయితే ఈ సినిమా కథా కమామిషు ఏంటీ.? ఎన్టీఆర్, చరణ్ పాత్రల తాలూకు వివరాలేంటీ.? అనే విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
చరణ్, ఎన్టీఆర్ క్యారెక్టర్స్‌పై గతంలో జరిగిన ప్రచారాలేమీ నిజం కావని ఎప్పుడో చిత్ర యూనిట్ ఖండించేశారు. ఇక రేపో మాపో సెట్స్ మీదికెళ్లేందుకు రెడీగా ఉన్న ఈ ప్రాజెక్ట్ విషయమై మిగిలిన పూర్తి వివరాలు ఇకనుండీ క్లారిటీగా ఒక్కొక్కటిగా రివీల్ కానున్నాయి.