షూటింగులు లేకపోవడంతో హీరోలందరూ కుటుంబానికి సమయం కేటాయిస్తున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండేవారు ఇంటి పట్టున ఉంటూ తీరిగ్గా కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా సేమ్ టు సేమ్. ఈమధ్య ట్విట్టర్, ఇన్స్టా గ్రామ్ లో యాక్టివ్ అయ్యారు కాబట్టి ఆసక్తికరమైన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. నిన్న చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా రెండు ఫోటోలు పోస్ట్ చేస్తూ "అప్పట్లో - హరిద్వార్ లో. ప్రస్తుతం అయితే పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయన్న ఆశతో కాలానికి తగ్గట్టు సాగిపోతున్నాము. జాగ్రత్తగా ఉండండి" అంటూ ట్వీట్ చేశారు.
ఈ ఫోటోలలో నీటి ప్రవాహం పక్కనే ఉన్న ఓ బండరాయిపై కూర్చుని చరణ్ ఎంతో స్టైలిష్ గా పోజిచ్చారు. స్పోర్ట్స్ వేర్లో తలకు క్యాప్ ధరించి ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. అప్పట్లో నిజంగా అందరం ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లిపోయేవారే కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. నిజంగా సాధారణ పరిస్థితులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం తప్ప ఏం చెయ్యగలం? ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం 'RRR' లో నటిస్తున్నారు. ఈ వారంలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. మరి చరణ్ ఎప్పటి నుంచి 'RRR' షూటింగులో పాల్గొంటారు అనేదానిపై ఇంకా సమాచారం లేదు.