'వైల్డెస్ట్‌ డ్రీమ్స్‌'లో చెర్రీ దంపతులతో మహేష్‌ దంపతులు.!

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ మంచి మంచి స్నేహం ఉంది. కలిసి వెకేషన్స్‌ ఎంజాయ్‌ చేయడంతో పాటు, ఇంట్లో జరిగే ప్రతీ ఫంక్షన్‌కీ ఒకరికొకరు హాజరవుతూ సరదాగా గడుపుతుంటారు. మెగా కోడలు ఉపాసన, మహేష్‌ భార్య నమ్రతా కూడా మంచి ఫ్రెండ్స్‌. ఈ మధ్య మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తనలోని కొత్త కోణాన్ని బయటికి తీస్తూ 'వైల్డెస్ట్‌ డ్రీమ్స్‌' అంటూ ఏకంగా వైల్డ్‌ లైఫ్‌ని తన ఇంటికే తీసకొచ్చేశాడు. అదేనండీ, వైల్డ్‌ లైఫ్‌ ఫోటో గ్రాఫర్‌గా తాను తీసిన ఫోటోలతో ఓ ఎగ్జిబిషన్‌ని ఇంట్లో ఏర్పాటు చేశాడు.

 

ఈ ఎగ్జిబిషన్‌ తిలకించేందుకు వస్తూ, రామ్‌చరణ్‌ని ప్రశంసిస్తున్నారు అందమైన సెలబ్రిటీలు మొన్న సమంత, మంచు లక్ష్మి తదితరులు ఈ ఎగ్జిబిషన్‌ తిలకించారు. రామ్‌ చరణ్‌ సూపర్‌ అని బెస్ట్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చి వెళ్లారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ సతీ సమేతంగా రామ్‌ చరణ్‌ 'వైల్డెస్ట్‌ డ్రీమ్స్‌' ఎగ్జిబిషన్‌ని తిలకించాడు. ఈ సందర్భంగా చెర్రీ దంపతులు, మహేష్‌ దంపతులు కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫోటో చూసి ఇటు మహేష్‌ ఫ్యాన్స్‌, అటు మెగా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం చరణ్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటిస్తుండగా, మహేష్‌ 'సరిలేరు..' ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకుంది. అన్నట్లు త్వరలో విడుదల కానున్న 'సరిలేరు నీకెవ్వరు..' సినిమా ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయనున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS