మణిరత్నం దర్శకత్వంలో రామ్‌చరణ్ అనగానే మెగా అభిమానులు పొంగిపోయి ఉంటారు. ఎందుకంటే మణిరత్నం స్టామినా అలాంటిది. ఈ వయసులోనూ 'ఓకే బంగారం'లాంటి క్యూట్ లవ్ స్టోరీ తీయగలగడం ఆయనకే చెల్లింది. 'ఓకే బంగారం' మూడ్‌లో ఉన్నందునో ఏమో... చరణ్, మణి కాంబినేషన్‌కి పిచ్చ క్రేజ్ వచ్చేసింది. చరణ్ కూడా సులువుగా ఒప్పేసుకొన్నాడు. అదే ఇప్పుడైతే... చరణ్ కచ్చితంగా 'నో' అనేవాడేమో. ఇదంతా చెలియా ఎఫెక్ట్ వల్లే. శుక్రవారం బాక్సాఫీసు ముందుకు వచ్చిన ఈ సినిమా... తొలి రోజే ఫ్లాప్ టాక్ తెచ్చుకొంది. విజువల్స్ తప్ప ఏం లేదు ఈ సినిమాలో అని విమర్శకులు కూడా క్లారిటీగా చెప్పేశారు. ధృవ సినిమాతో ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వచ్చిన చరణ్.. ఇప్పుడు తన నిర్ణయం మార్చుకొంటాడేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుకుమార్ సినిమా పూర్తయ్యాక మణి సినిమా పట్టాలెక్కుతుంది. ఈలోగా ఏమైనా జరగొచ్చు అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.