చిరు సినిమా కోసం కొరటాల ఏం చెప్పారబ్బా.!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రామ్‌ చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి ఫుల్‌ మేకోవర్‌తో కనిపిస్తుండడం చూస్తున్నాం. అయితే, తాజాగా ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ, నిర్మాత రామ్‌చరణ్‌ మీట్‌ అయ్యారు. జస్ట్‌ క్యాజువల్‌ మీటింగేలెండి.

 

అనుకోకుండా, రామ్‌చరణ్‌, కొరటాల శివ ఆఫీస్‌కి వెళ్లారట. అక్కడ ఆయనతో కలిసి దిగిన ఫోటోని షేర్‌ చేసి, ఫ్యాన్స్‌తో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా చిరు సినిమా కోసం కాసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారట. సినిమా పట్ల కొరటాలకున్న ఆసక్తికి చాలా ఇంప్రెస్‌ అయ్యానని రామ్‌చరణ్‌ చెప్పారు. ఇంతకీ వీరిద్దరూ సినిమా గురించి ఏం మాట్లాడుకున్నారో.

 

కానీ, ఇంకా ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్‌ ఇతర నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే అంశంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. త్రిష, అనుష్క తదితర ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే కొందరు సీనియర్‌ బాలీవుడ్‌ భామల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. నయనతార, తమన్నా ఆల్రెడీ 'సైరా' కోసం చిరుతో జత కట్టేశారు. సో లేటెస్ట్‌ మూవీ కోసం మెగా ఛాన్స్‌ ఎవరిని వరించనుందో చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS