శ్రీముఖి తల్లి కూడా శ్రీముఖిలానే!

మరిన్ని వార్తలు

నిన్నటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో శ్రీముఖి తల్లి హౌస్‌లోకి ప్రవేశించింది. ఆమె ఎంట్రీ కాగానే, శ్రీముఖికి ఫ్రీజింగ్‌ మూడ్‌ ఆదేశించాడు బిగ్‌బాస్‌. లోపలికి వచ్చిన తల్లిని వచ్చిన దారిలోనే బయటికి వెళ్లమని ఆదేశించాడు. దాంతో శ్రీముఖి చేసిన ఓవరాక్షన్‌ అంతా ఇంతా కాదు. ఇక ఐదారేళ్ల చిన్నపిల్లలా ఏడ్చి గోల చేసింది. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ మెయిన్‌ డోర్‌ నుండి శ్రీముఖి తల్లి లత ఇంట్లోకి ప్రవేశించింది.

 

చాలా సేపు తల్లీ కూతుళ్లు ప్రయివేట్‌గా మాట్లాడుకున్నారు. మధ్యలో రాహుల్‌ గురించి ఎత్తి, ఆయన అలా చేయడం చాలా పెద్ద తప్పు.. అంటూ బురద చల్లే ప్రయత్నం చేసింది. చాలా సార్లు రాహుల్‌ని బ్లేమ్‌ చేయడానికి యత్నించింది శ్రీముఖి తల్లి. మధ్యలో బాబా భాస్కర్‌ని పిలిచి, ఆయనతోనూ అదే టాపిక్‌ రైజ్‌ చేసింది. బాబా కూడా అందుకు ఆమెతో వంత పాడాడు. నేను శ్రీముఖిని జాగ్రత్తగా చూసుకుంటాను.. అంటూ ఆమెకు మాటిచ్చాడు. ఈ తంతు, రాహుల్‌ ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది. అది చాలదన్నట్లు డైనింగ్‌ టేబుల్‌ వద్ద అందరితోనూ మాట్లాడుతూ, రాహుల్‌ని ఉద్దేశించి, శ్రీముఖి, నువ్వు చాలా మంచి ఫ్రెండ్స్‌.

 

నువ్వు హౌస్‌లోకి వెళ్తున్నావని తెలిసి నా బిడ్డకు తోడుంటావని తెలిసి చాలా సంతోషించాను. కానీ అలా జరగలేదు. మాట్లాడుకోండి.. పోట్లాడుకోకండి.. అంటూ హెచ్చరించింది. మా పిల్లని తిడితే పేరెంట్స్‌గా మేం చాలా హర్టవుతాం. ఇక రెండు వారాలే మిగిలి ఉంది. మళ్లీ ఇది రిపీట్‌ కాకూడదు.. అంటూ వార్నింగ్‌ ఇచ్చింది. రాహుల్‌కి శ్రీముఖి తల్లి వార్నింగ్‌ ఇవ్వడాన్ని రాహుల్‌ ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీముఖిలాగే ఆమె తల్లి కూడా హౌస్‌లో చాలా చీప్‌గా బిహేవ్‌ చేసింది.. అంటూ సోషల్‌ మీడియా వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS