రామ్‌చరణ్‌ బెస్ట్‌ ఎవర్‌ లుక్‌.!

By iQlikMovies - August 18, 2018 - 16:03 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ - బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కోసం రామ్‌చరణ్‌ న్యూ గెటప్‌లోకి మారిపోనున్నాడట. పూర్తిగా స్టైలిష్‌ లుక్‌ అట అది. ఇటీవల తెలుగు సినిమా రూపు రేఖల్ని మార్చేసిన 'రంగస్థలం' సినిమా కోసం పల్లెటూరి అబ్బాయిగా రఫ్‌డ్‌ లుక్‌లో కనిపించాడు రామ్‌చరణ్‌. ఆ పాత్రకు తగ్గట్లుగా ఫుల్‌గా గెడ్డం పెంచేశాడు. కొంచెం ఒళ్లు కూడా చేశాడు. 

అయితే తాజా చిత్రం కోసం ఆ తర్వాత కండలు బాగా కరిగించి, ఒళ్లు తగ్గించాడు. దాంతో పాటు పూర్తిగా బాడీ లాంగ్వేజ్‌ కూడా మార్చేశాడట. ఈ లుక్‌లో రామ్‌చరణ్‌ చాలా చాలా బ్రైట్‌గా కనిపిస్తాడట. ఇంతవరకూ చరణ్‌ చేసిన సినిమాల్లో బెస్ట్‌ ఎవర్‌ లుక్‌ ఇది అంటున్నారు. అతి త్వరలోనే ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేయనున్నారనీ తెలుస్తోంది. 

ఇటీవల 'గీత గోవిందం' టీమ్‌ చరణ్‌ని కలిసినప్పుడు దిగిన ఫోటోలో చరణ్‌లోని ఆ మార్పు బాగా తెలుస్తోంది. లవర్‌ బోయ్‌ గెటప్‌లో బ్రైట్‌ ఫీచర్స్‌తో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా 'భరత్‌' బ్యూటీ కైరా అద్వానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ఈ చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్నాడు. గతంలో సుపరిచితులైన ఆర్యన్‌ రాజేష్‌, ప్రశాంత్‌ తదితర నటులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS