మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తదుపరి చిత్రం బోయపాటి శీను దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చరణ్ ఫిట్నెస్ పెంచనున్నాడట. 'ధృవ' సినిమాలో రామ్‌చరణ్ చాలా ఫిట్‌గా కనిపిస్తాడు. కండలు పెంచి, సిక్స్ ప్యాక్‌కి మించిన బాడీతో చాలా స్టైలిష్‌లుక్‌లో కనిపించాడు. ఆ సినిమాలో చరణ్‌ది ఐపీఎస్ ఆఫీసర్ పాత్ర కావడంతో అంతలా కండలు కరిగించాడు.
అయితే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'రంగస్థలమ్' సినిమాలో పల్లెటూరి కుర్రోడి పాత్రలో కనిపించనున్నాడు చరణ్. అయినా కానీ ఫిట్‌నెస్‌లో అలాగే కనిపించనున్నాడు. అయితే బోయపాటి సినిమాల్లో హీరోలు ఫిట్నెస్తో పాటు, చాలా స్టైలిష్‌లుక్‌లో కనిపిస్తుంటారు. అందుకోసం చరణ్ స్పెషల్‌గా కసరత్తులు చేస్తున్నాడట. 'ధృవ' టైంలోని ఫిట్నెస్ బాడీని తిరిగి తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నారట. భారీగా కండలు కరిగిస్తున్నాడనీ సమాచారమ్. 'రంగస్థలం' కోసం తన బాడీలాంగ్వేజ్‌ని పూర్తిగా మార్చేసుకున్న చరణ్, మళ్లీ బోయపాటి సినిమా కోసం సరికొత్త స్టైల్లోకి మారబోతున్నాడట. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుంది ఈ చిత్రం. ఈ సినిమాలో చరణ్‌ని ఇంతకు ముందెన్నడూ చూడనంత స్టైలిష్ లుక్‌లో బోయపాటి చూపించనున్నాడట.
చరణ్ లుక్ సంగతి పక్కన పెడితే, ఈ సినిమా కోసం హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీని దించనున్నారనీ సమాచారమ్. అనూ ఇమ్మాన్యుయేల్‌ని ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారనీ ప్రచారం జరుగుతోంది. అయితే ఆ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. చూడాలి చరణ్‌తో జోడీ కట్టబోయే ఆ చిన్నది ఎవరో? ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది.