గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR లాంటి బిగ్గెస్ట్ హిట్ అందుకుని మూడేళ్ళ తరవాత గేమ్ చేంజర్ తో వచ్చాడు. ఈ మూవీ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. దీనికి పలు కారణాలు ఉన్నాయని కొందరి వాదన. RRR తరువాత ఎన్టీఆర్ దేవర మూవీతో వచ్చి సోలోగా పాన్ ఇండియా హిట్ కొట్టాడు. కానీ చెర్రీ ఇంకా బాకీ ఉన్నాడు. దీంతో ఇప్పడు వరుస సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నాడు చెర్రీ. కథలు కూడా ఆచి తూచి ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇప్పడు ఉప్పెన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న బుచ్చి బాబుతో RC16 కమిట్ అయ్యాడు.
నెక్స్ట్ రంగస్థలం లాంటి హిట్ అందించిన సుకుమార్ తో కలిసి ఒక సినిమా కమిట్ అయ్యాడు. ఈ మూవీ తరవాత మళ్ళీ చెర్రీ దిల్ రాజు బ్యానర్ లో ఒక సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కారణం గేమ్ చేంజర్ సినిమా తో దిల్ రాజు దాదాపు 120 కోట్లు నష్టపోయారని, ఆ నష్టాన్ని భర్తీ చేయటానికి చెర్రీ మళ్ళీ దిల్ రాజుతో వర్క్ చేయటానికి ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కానీ అవన్నీ ఫేక్ న్యూస్ అని తెలుస్తోంది.
వీటిపై తాజాగా చెర్రీ పీ.ఆర్ టీమ్ స్పందిస్తూ అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. ప్రస్తుతం చెర్రీ రెండు సినిమాలకి మాత్రమే కమిట్ అయ్యాడని, ఇంకే ప్రాజెక్ట్ ఒప్పుకోలేదని స్ఫష్టం చేసారు. బుచ్చిబాబు సినిమా 2025 కి ముగియగా, నెక్స్ట్ సుక్కు సినిమాకి వర్క్ చేస్తాడు. ఈ లెక్కన చెర్రీ 2027 వరకూ ఫుల్ బిజీ.