రాజమౌళితో సినిమా అంటే ఎవరికైనా ఆనందమే. కథేమిటి? మా పాత్రేమిటి? పారితోషికం ఎంత? ఇలాంటివేం ఆలోచించరు. ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టడం, ఆ తరవాత.. వాళ్లు మరో పది మెట్లు ఎక్కడం మామూలే. కానీ రాజమౌళితో సినిమా అంటే.. ఓ ఇబ్బంది కూడా ఉంది. ఆ హిట్టు తరవాత.. మరో హిట్టు కొట్టడానికి తాతలు దిగొస్తారు. రాజమౌళి ట్రాక్ రికార్డ్ చూడండి. ఓ హీరోతో సినిమా చేశాడంటే.. ఆ హీరోకి ఆ తరవాత హిట్లు రావు. సింహాద్రి తరవాత ఎన్టీఆర్ కి వరుస ఫ్లాపులొచ్చాయి. మగధీర తరవాత మళ్లీ అలాంటి హిట్ కొట్టడానికి చరణ్ చాలా కాలం ఎదురు చూడాల్సివచ్చింది. బాహుబలి తరవాత.. ఆల్మోస్ట్ ప్రభాస్ పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకూ ఈ ఫ్లాపుల గోల తప్పదా? అనే చర్చ టాలీవుడ్ లో హాట్ హాట్ గా నడుస్తోంది.
ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్నాడు. చరణ్ ఖాతాలో శంకర్ సినిమా ఉంది. ఓ రకంగా ఇవి రెండూ స్ట్రాంగ్ ప్రాజెక్టులే. కొరటాలకు ఇప్పటి వరకూ ఫ్లాపులు పడలేదు. శంకర్ ఎప్పుడూ వరస్ట్ సినిమా చేయడు. ఆ రకంగా.. ఇద్దరూకాస్త సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. కాకపోతే... ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. అవి చాలా వరకూ నిజం అవుతాయి కూడా. చూద్దాం.. జక్కన్న బ్యాడ్ సెంటిమెంట్ ఈసారి ఏమవుతుందో?