మహేష్ బాబు - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. ఏప్రిల్ లేదా మే నుంచి చిత్రీకరణ మొదలవుతుంది. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డేని ఎంచుకొన్నారని టాక్ వినిపిస్తోంది. మరో కథానాయికగా శ్రీలీల పేరు బయటకు వచ్చింది. అయితే ఇప్పటి వరకూ చిత్రబృందం అధికారికంగా ఏం ప్రకటిచంలేదు.
ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ రోల్ ఉంది. ఆ పాత్ర ఎవరికి ఇవ్వాలన్న విషయంపై త్రివిక్రమ్ మల్లగుల్లాలు పడుతున్నాడు. మోహన్ బాబు, మోహల్ లాల్, మమ్ముట్టి లాంటి పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఇప్పుడు ఉపేంద్ర పేరు ఖాయం చేసినట్టు టాక్. ఈ సినిమాలో ఉపేంద్ర - మహేష్ బాబు.. అన్నదమ్ములుగా కనిపిస్తారని తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన `సన్నాఫ్ సత్యమూర్తి`లో ఉపేంద్ర నటించిన సంగతి తెలిసిందే. అది విలన్ పాత్ర. అయితే.. ఈసారి ఉపేంద్ర పూర్తి పాజిటీవ్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. అతడు, ఖలేజా తరవాత మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. కాబట్టి అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తగ్గట్టే స్క్రిప్టు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని పకడ్బందీగా రాసుకొన్నాడని సమాచారం.