ధర్మయోగి-రంగస్థలం సినిమాలకి మధ్య పోలికలు!

By iQlikMovies - March 27, 2018 - 12:03 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం ఇంకొక మూడురోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. అలాగే ఈరోజు చరణ్ పుట్టినరోజు కావడంతో మెగా అభిమానులకి ఈ వారం మొత్తం మెగా వీక్ గా మారిపోయింది.

ఇక విషయానికి వస్తే, 2016లో ధనుష్-త్రిష జంటగా తమిళంలో కోడి అనే చిత్రం వచ్చింది. ఇక ధర్మయోగి అనే పేరుతో ఈ చిత్రం తెలుగులోకి డబ్బింగ్ కూడా అయింది. ఈ సినిమా విమర్శకులనే కాక ప్రేక్షకులని కూడా మెప్పించింది.

అయితే దీనికి ఇప్పుడు రామ్ చరణ్ రంగస్థలం సినిమాకి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా.. ఈ రెండు చిత్రాలు రాజకీయాల నేపధ్యంలో ఉండడం అలాగే అన్న రాజకీయాల్లో హత్యకాబడితే తమ్ముడు ప్రతీకారం తీసుకోవడం అనేది ఇందులో రెండు పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇక ఈ రెండు సినిమాలలో ఒక పెద్ద తేడా ఈ చిత్రాలలో ఏంటి అంటే, ధర్మయోగిలో హీరో ధనుష్ ద్వీపాత్రాభినయం చేస్తే ఇందులో మాత్రం అన్నదమ్ములుగా ఇద్దరు వేరే నటించారు. ఇక సినిమా విడుదలకి ముందు ఇలా పోలికలు అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఈ రెండు చిత్రాల్లో పోలికలు ఇంకేమైనా ఉన్నాయా లేవా అనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS