ఫాన్స్ ని భయపెడుతున్న 'రంగస్థలం' లేటెస్ట్ న్యూస్..!

By iQlikMovies - March 26, 2018 - 15:03 PM IST

మరిన్ని వార్తలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమా ఇంకొక నాలుగు రోజులలో విడుదలకానుంది. అయితే ఈ సమయంలో ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం ఇప్పుడు అందరిని బయపెడుతున్నది. 

ఆ వివరాల్లోకి వెళితే, రంగస్థలం సినిమా నిడివి మొత్తం 3 గంటలకు పైగా ఉందట. అయితే ఆ నిడివి సినిమా భవిష్యత్తుని ప్రభావితం చేయోచ్చు అన్న కారణంతో దానిని 2 గంటల 52నిమిషాలకు తగ్గించినట్టు తెలుస్తున్నది. ఇక సెన్సార్ కి ఈ సినిమా ఒకటి రెండు రోజుల్లో వెళ్ళనుంది.

అయితే అర్జున్రెడ్డి చిత్రం నిడివి 3గంటల పైగా ఉన్నప్పటికి కూడా ఆ సినిమా జనాదరణ పొందింది. అలాగే సినిమా ప్రేక్షకులని కట్టిపడేసేలా ఉంటే నిడివి పెద్ద సమస్య కాదన్న వారు కూడా లేకపోలేదు.

చూద్దాం.. సెన్సార్ అయ్యాక ఈ సినిమా నిడివి ఎంత అనే దాని పైన క్లారిటీ రానుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS