ఇది వరకు తెలుగు హీరోకి కోటి రూపాయల పారితోషికం ఇవ్వడం అంటే విచిత్రం. కోటి రూపాయల పారితోషికం తీసుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా చిరంజీవి రికార్డు కెక్కారు. ఆ తరవాత... కోట్ల పారితోషికం తీసుకోవడం టాలీవుడ్ లో మామూలైపోయింది. ఒక్క హిట్టు కొడితే చాలు... కొత్త హీరోకైనా 2 కోట్లు ఇవ్వాల్సిందే. అలా తయారైంది లెక్క. ఇక ప్రభాస్, మహేష్, పవన్ లాంటి కథానాయకుల విషయంలో చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్ ఒక్కో సినిమాకీ వంద కోట్లు తీసుకుంటున్నాడని టాక్. మహేష్,పవన్‌లు 50 కోట్ల మైలు రాయిని ఎప్పుడో దాటేశారు.
ఇప్పుడు రామ్ చరణ్ పారితోషికంపైనా ఆసక్తికరమైన కథనాలు, వార్తలొస్తున్నాయి. `ఆర్.ఆర్.ఆర్` సినిమాకి గానూ... చరణ్ 30 కోట్ల పారితోషికం తీసుకున్నాడని సమాచారం. అంతే కాదు.. ఈ సినిమా లాభాల్లోనూ తనకు వాటా ఉంది. ఇప్పుడు శంకర్ సినిమా కోసం అంతకు మించిన పారితోషికం తీసుకోబోతున్నాడని టాక్. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమాలో చరణ్ 50 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట. అంతేకాదు... లాభాల్లోనూ తనకు వాటా ఉందని సమాచారం. అలా చూస్తే.. పవన్, చరణ్‌లకంటే.. ఎక్కువ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్నది రామ్ చరణే అవుతాడు. పారితోషికాల లెక్కలు సహజంగా బయటకు రావు. ఎవరూ చెప్పరు కూడా. ఈ వార్తల్ననీ ఊహాగానాలే. కాకపోతే.. చరణ్ పారితోషికం కచ్చితంగా 30 కోట్లకు పైమాటే. ఆర్.ఆర్.ఆర్ హిట్టయితే.. చరణ్ కూడా 50 కోట్ల హీరో అయిపోవడం ఖాయం.