రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. కిరాయా అద్వాణీ కథానాయిక. ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్లు ఖర్చు పెడుతున్నట్టు టాక్. శంకర్ దర్శకత్వంలో చరణ్ అనగానే మెగా అభిమానులు సంబర పడిపోయారు. దానికీ ఓ బలమైన కారణం ఉంది. శంకర్ మామూలు దర్శకుడు కాదు. తనదైన రోజున అద్భుతాలు సృష్టించగలడు. ఈసినిమాతో చరణ్ మరో మెట్టు ఎదగడం ఖాయం అన్నది అందరి నమ్మకం.
అయితే... శంకర్ ప్రస్తుతం ఫామ్ లో లేడు. ఐ, రోబో 2.0 చిత్రాలు బాగా నిరాశ పరిచాయి. మరి ఇప్పుడేం చేస్తాడన్నది ప్రశ్న. దానికి తగ్గట్టు ఈసినిమాలో చరణ్ ది ఆడుతూ పాడుతూ చేసుకుని పోయే పాత్ర కాదు. బాధ్యత గల ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర. ఏమాత్రం తూకంలో తేడా వచ్చినా.... విమర్శల పాలవ్వాల్సివస్తోంది. మరో విషయమేమంటే....ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీ కొడుకులుగా ద్వి పాత్రాభినయం చేయబోతున్నాడని ఓ టాక్ వినిపిస్తోంది. తండ్రి పాత్ర అంటే.. ఎలా ఉంటుందో ఊహించుకోవొచ్చు. అంత బరువైన పాత్ర చేయగలిగే ఓర్పు, నేర్పు చరణ్ కి ఉన్నాయా? ముసలి పాత్రలో చరణ్ ని చూడగలరా? అనేది ప్రధానమైన ప్రశ్నలు. ఓరకంగా చరణ్‌కి ఇది రిస్కీ ప్రాజెక్టు లాంటిది. ఇందులోంచి బయటపడి.... ఓకే అనిపించుకుంటే, చరణ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లిపోవడం గ్యారెంటీ. మరి ఏం జరుగుతుందో చూడాలి.