వికారాబాద్‌ అడవుల్లో చరణ్‌ యాక్షన్‌!

మరిన్ని వార్తలు

'ఆర్‌ఆర్‌ఆర్‌' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. వైజాగ్‌ అటవీ ప్రాంతంలో ఎన్టీఆర్‌పై ఈ మధ్య ఓ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసిన చిత్ర యూనిట్‌ ప్రస్తుతం హైద్రాబాద్‌లో తాజా షెడ్యూల్‌కి ప్లాన్‌ చేసింది. హైద్రాబాద్‌లోని వికారాబాద్‌ అడవుల్లో కొన్ని యాక్షన్‌ సీన్స్‌కి రంగం సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్‌ పూర్తిగా రామ్‌చరణ్‌ పైనే చిత్రీకరించనున్నారట. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుందని అంటున్నారు. దాదాపు మార్చికల్లా షూటింగ్‌ షెడ్యూల్‌ మొత్తం కంప్లీట్‌ అయిపోతుందని చిత్ర యూనిట్‌ చెబుతుంది.

 

ఆ తర్వాత విఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌పై దృష్టి పెట్టనున్నారట. ఈ సినిమాలో విఎఫ్‌ఎక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సో దానికే ఎక్కువ టైమ్‌ పట్టనుందట. అనుకున్న టైమ్‌కి సినిమాని ఎలాగైనా విడుదల చేయాలన్న కసితో రాజమౌళి ఉన్నాడట. కానీ, అది జరిగే పనేనా.? అనే అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ఈ మధ్య ఓ కార్యక్రమంలో 'ఆర్‌ఆర్‌ఆర్‌' అనుకున్న టైమ్‌కి ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.. అని చరణ్‌ లేటెస్ట్‌గా కన్‌ఫామ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతమందిస్తున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ చరణ్‌కి జోడీగా నటిస్తుండగా, హాలీవుడ్‌ భామ ఒలివియా ఎన్టీఆర్‌తో జత కడుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS