`ఆర్.ఆర్.ఆర్` తరవాత.. శంకర్‌తో సినిమా చేయడానికి ఫిక్సయ్యాడు రామ్ చరణ్. ఈ క్రేజీ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. అయితే... లైకా ప్రొడక్షన్స్ (ఇండియన్ 2 నిర్మాతలు)తో శంకర్‌కి విబేధాలొచ్చాయి. ఆ సినిమా పూర్తయ్యేంత వరకూ శంకర్ మరో సినిమా చేయకూడదని లైకా ప్రొడక్షన్స్ పట్టుబట్టింది. ఈ విషయంలో కోర్టుకు కూడా వెళ్లింది. దాంతో రామ్ చరణ్సినిమా సందిగ్థంలో పడింది.
అయితే ఇప్పుడ ఈ చిత్రానికి క్లియరెన్స్ వచ్చినట్టు సమాచారం. అందుకే చరణ్ తో సినిమాకి సంబంధించిన పనుల్ని శంకర్ వేగవంతం చేశాడు. చెన్నైలో ఈ సినిమాకి సంబంధించిన కథా చర్చలు నడుస్తున్నాయి. ఇటీవల చరణ్ - దిల్ రాజు - శంకర్ లమధ్య కీలకమైన సమావేశం జరిగిందని, వచ్చే నెలలోనే ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని సమాచారం. ఈ పాన్ ఇండియా సినిమాకి తమన్ స్వరాలు అందిస్తారు. ఈ విషయాన్ని తమన్ సైతం అధికారికంగా ప్రకటించారు.