కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్స్గా మారాడు.. హరీష్ శంకర్. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో సిద్ధహస్తుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో ఓ ప్రాజెక్టు చేస్తున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈలోగా.. హరీష్ మరో కథనీ సిద్ధం చేశాడట. ఈసారి.. విజయ్ దేవరకొండ కోసం అని సమాచారం.
దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయాలి. ఇప్పటికే ఎగ్రిమెంట్లు జరిగిపోయాయి. అయితే కథేంటి? దర్శకుడు ఎవరు? అనే విషయాలు తెలీలేదు. విజయ్ దేవరకొండకు సరిపడే కథ కోసం దిల్ రాజు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. హరీష్ కథని ఓకే చేసినట్టు టాక్. ఈ కథ త్వరలోనే విజయ్ దేవరకొండకు వినిపిస్తార్ట. అది నచ్చితే... ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయిపోయినట్టే. నిజానికి `లైగర్` తరవాత.. సుకుమార్ తో ఓ సినిమా చేయాలి విజయ్. ఆ డేట్లు ఖాళీ అవ్వబోతున్నాయి. పుష్ష పనుల్లో.. విజయ్ దేవరకొండ సినిమాకి తగిన టైమ్ కేటాయించలేకపోతున్నాడు సుకుమార్. ఆ సినిమా స్థానంలోనే హరీష్ సినిమా పట్టాలెక్కే ఛాన్సుందని సమాచారం.