చరణ్, శ్రియ కలిసి కనిపిస్తున్న ఈ ఫోటో ఎప్పటిదంటారా? అందరికీ అదే డౌట్ వస్తోంది. సీనియర్ హీరోయిన్ శ్రియ. ఈ ఇద్దరూ కలిసి కనిపించింది లేదు ఇంతవరకూ. అలాంటిది ఒకే ఫ్రేములో ఇలా దర్శనమిచ్చారు. శ్రియ గతంలో మెగాస్టార్ చిరంజీవితో 'ఠాగూర్' సినిమాలో నటించింది. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో 'బాలు' సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది. తర్వాత 'కొమరం పులి' సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లోనూ మెరిసింది. బహుశా అప్పటి టైంలో చరణ్ షూటింగ్స్‌కి వచ్చినప్పుడు ఎప్పుడైనా కెమెరాకి చిక్కిన వీడియో కావచ్చు. ఇప్పుడిది లేటెస్టుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే శ్రియ ఫేస్ ఫీచర్స్ చూస్తుంటే, ఇది 'ఠాగూర్' సినిమా టైంలో ఫోటో అని భావిస్తున్నారు అంతా. అయితే అప్పటికి చరణ్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇది ఆ టైంలోని వీడియో కావచ్చని కూడా అంటున్నారు. అప్పటికే సీనియర్ హీరోయిన్ అయిన శ్రియ మాత్రం ఈ ఫోటోలో ఎక్స్‌ప్రెషన్స్‌తో అదరగొట్టేస్తోంది. ప్రస్తుతం వయసు మీద పడినా కానీ, రెట్టించిన గ్లామర్‌తో ఇంకా బిజీయెస్ట్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది శ్రియ. లేటెస్టుగా బాలయ్య 'పైసా వసూల్' సినిమాలో శ్రియ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇన్ ఫ్యూచర్ చరణ్ సినిమాలో శ్రియ ఏదో ఒక పాత్రలో కనిపిస్తుందేమో చూడాలిక.