సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తోంది. 1980 కాలం నాటి కథ ఇది. అప్పటి వాతావరణ పరిస్థితుల్ని ప్రతిబింబించేలా... గ్రామీణ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. అయితే అనుకోకుండా షూటింగ్‌కి గ్యాప్వచ్చింది. రామ్ చరణ్ డుమ్మా కొట్టడంతో.. షూటింగులకు బ్రేకులు పడ్డాయి. భరించలేని ఉక్కపోత, భీకరమైన ఎండల వల్ల చరణ్ శారీరకంగా చాలా అలసిపోయాడట. అందుకే ఎండలు తగ్గుమొఖం పట్టేవరకూ.. షూటింగులకు రానని చరణ్ చెప్పేశాడట. దాంతో.. షూటింగుకి తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. ఈ సినిమాని దసరాకి సిద్దం చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకే నాన్ స్టాప్ షెడ్యూల్ ప్లాన్ చేసింది. కానీ చరణ్ ఇలా అనూహ్యంగా షూటింగుకి డుమ్మా కొట్టడంతో... చిత్రబృందానికి ఏం చేయాలో పాలు పోవడం లేదు.