ఓ హీరో చేయాల్సిన కథ మరో హీరో చేతికి చేరడం టాలీవుడ్ లో సర్వసాధారణం. కరోనా వల్ల అందరి ప్రణాళికలూ తల్లకిందులైపోయాయి. ఒకరి సినిమా మరొకరి చేతిలోకి వెళ్లిపోతోంది. తాజాగా... ప్రభాస్ కథ కూడా రామ్ చరణ్ ఖాతాలోకి చేరిపోయిందన్న టాక్ ఒకటి.... టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. కేజీఎఫ్‌తో ఒక్కసారిగా చిత్రసీమలోని హీరోల దృష్టిలో పడిపోయాడు ప్రశాంత్ నీల్. టాలీవుడ్ నుంచి అయితే క్రేజీ ఆఫర్లు వచ్చాయి, మైత్రీ మూవీస్ ఈ దర్శకుడికి అడ్వాన్సు ఇచ్చింది
. ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్టు గట్టిగా ప్రచారం సాగింది. మహేష్‌బాబు, ప్రభాస్ ల పేర్లు వినిపించాయి. అయితే.. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఈ లిస్టులో చేరిపో్యాడు. ప్రభాస్ కోసం `ఉగ్రం ` ని తెలుగులో రీమేక్ చేయాలనుకున్నాడు ప్రశాంత్. అయితే ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలతో బిజీ అవుతున్నాడు. తన చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యేటప్పటికి మరో నాలుగేళ్లయినా పడుతుంది. అప్పటి వరకూ ప్రశాంత్ నీల్ ఆగాలి. కానీ.. అదే కథని రామ్ చరణ్ తో చేద్దామని ఫిక్సయాడట. మైత్రీలో రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సివుంది. ఇప్పుడు అటు ప్రశాంత్ నీ, ఇటు చరణ్‌నీ సెట్ చేస్తే బాగుంటుందని మైత్రీ భావిస్తోందట. పైగా `ఆర్.ఆర్.ఆర్` తరవాత రామ్ చరణ్ ఖాళీనే. కొత్త ప్రాజెక్టేం ప్రకటించలేదు. కాబట్టి.... ఈ కాంబో సెట్టయ్యే అవకాశాలున్నాయని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.