తన కెరీర్లో తొలిసారి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు రామ్‌చరణ్. `ఆర్.ఆర్.ఆర్` కోసం ఎన్టీఆర్‌తో కలిసి వెండి తెరని పంచుకోబోతున్నాడు. ఇప్పుడు తన ఖాతాలో మరో మల్టీస్టారర్ చేరబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. మలయాళంలో సూపర్ హిట్ అయిన సినిమా 'డ్రైవింగ్ లైసెన్స్'. ఫృథ్వీరాజ్, సూరజ్ కథానాయకులుగా నటించారు. లాల్ జూనియర్ దర్శకుడు. ఓ సినిమా స్టార్కీ, మోటార్ వెహికల్ ఇన్స్పైక్టర్కీ మధ్య జరిగే కథ ఇది. పాయింట్ చిన్నదే అయినా , సినిమా మాత్రం ఆసక్తిగా సాగుతుంది.
ఈ సినిమాపై రామ్ చరణ్ దృష్టి పడినట్టు సమాచారం. వెంకటేష్‌తో కలిసి ఈ సినిమా చేయాలన్న ఆలోచనలో ఉన్నాడట. ఈ సినిమా హక్కుల్ని సైతం చరణ్ చేజిక్కించుకున్నాడని వార్తలొస్తున్నాయి. వెంకటేష్‌కి కూడా యువ కథానాయకులతో నటించడం అంటే ఆసక్తి. పైగా రీమేక్ కథలంటే మక్కువ. చరణ్ అడిగితే వెంకీ కాదనలేడు. వెంకీ,చరణ్‌లు కలిస్తే.. మరో అద్భుతమైన కాంబోకి రంగం సిద్ధమైనట్టే. కాకపోతే.. ఈసినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం.