చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో.. `ఆచార్య‌` టీజ‌ర్‌‌

By Gowthami - January 27, 2021 - 13:00 PM IST

మరిన్ని వార్తలు

చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. ఆచార్య‌ టీజర్‌ కోసం మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు టీజ‌ర్ కోసం ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 29 సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రత్యేక వీడియోను పోస్ట్‌ చేస్తూ..‘తమ ధర్మ స్థలి తలుపులు వచ్చే జనవరి 29న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు తెరుచుకుంటాయని’ చిత్రబృందం తెలియజేసింది.

 

ఇక ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ `సిద్ధ` అనే కీలక పాత్రలో నటించబోతున్నాడు. టీజ‌ర్‌లో చ‌ర‌ణ్ క‌నిపించ‌డ‌ని టాక్. కేవ‌లం చిరంజీవి పాత్ర‌పై హైలెట్ చేస్తూ ఈ టీజ‌ర్ క‌ట్ చేశార్ట‌. అయితే.. చ‌ర‌ణ్ గొంతు మాత్రం వినిపిస్తుంద‌ని, ఈ టీజ‌ర్‌కి చ‌ర‌ణ్ వాయిస్ ఓవ‌ర్ అందించాడ‌ని టాక్‌. దాదాపు 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ వేస‌వికి విడుద‌ల కానుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS