ట్విట్టర్ పోస్టులతో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తూ, వార్తల్లో ఉండాలనుకునే వర్మ ఈ మధ్య తన ట్విట్టర్ ఖాతాను క్లోజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మన కాంట్రవర్సీ డైరెక్టర్ ట్విట్టర్ ఖాతాను మళ్లీ తెరిచారు.
'ట్విట్టర్ అజ్ఞాతవాసం పుచ్చుకున్న నేను మళ్లీ పి.కె అజ్ఞాతవాసి స్పూర్తిగా రెండోసారి ట్విట్టర్‌లోకి అడుగు పెట్టాను' అని ఫస్ట్ ట్వీట్ వేశాడు వర్మ. అంతేకాదు వరుసగా ట్వీట్స్ వేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్, రజనీకాంత్ మీద వర్మ వరుస ట్వీట్స్ వేశారు. 'రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానని చేసిన ప్రకటన చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. తమిళనాడులో ప్రతీ ఒక్కరూ రజనీకాంత్‌కి ఓటేసి, మిగతా పార్టీలకు షాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.'. అని వర్మ ట్వీట్ చేశారు.
మళ్లీ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టడం వెనక ఆంతర్యం ఏమిటో కానీ, వర్మ అభిమానులకు ఇది ఆనందించదగ్గ విషయమే. మరో పక్క రామ్ గోపాల్ వర్మ సినిమాలతో బిజీగా ఉన్నాడు. నాగార్జున హీరోగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత వర్మ, నాగార్జునతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు వర్మ.
ఈ మధ్య కొత్త కొత్త ప్రయోగాలతో సక్సెస్‌లు కొడుతున్న నాగార్జున పక్కా యాక్షన్ కంటెన్ట్ ఉన్న సినిమాలో నటిస్తున్నారు వర్మ సినిమాతో. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. మరో పక్క ఎన్టీఆర్ బయోపిక్‌గా తెరకెక్కుతోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని వర్మ చేయాల్సి ఉంది. ఈ సినిమాని ఫిబ్రవరిలో ప్రారంభిస్తాననీ వర్మ అన్నారు. ఈ సినిమా కోసం కొత్త నటీనటుల్ని ఎంపిక చేసుకోనున్నారు వర్మ.