ఈమధ్య చిల్లర సినిమాలు తీసి పలచనైపోయాడు గానీ, ఆర్జీవీ అంటేనే ఓ చరిత్ర. ఇప్పటికీ బాలీవుడ్ లో ఆర్జీవీకి మంచి పేరుంది. తన మైలేజీని అక్కడ మాత్రం అలానే నిలబెట్టుకున్నాడు ఆర్జీవీ. అక్కడ సూపర్ స్టార్స్ తో పనిచేయడం వర్మకి కొత్త కాదు. తెలుగులో పెద్ద హీరోలు వర్మకి ఛాన్సులు ఇవ్వరు గానీ, బాలీవుడ్ లో మాత్రం అలా కాదు. తను కథ చెబుతానంటే, ఇప్పటికీ అక్కడి హీరోలు సిద్ధమే. తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో సినిమా చేయడానికి వర్మ పెద్ద స్కెచ్ వేశాడన్నది బాలీవుడ్ టాక్.
అమితాబ్ తో ఇప్పటికే మూడు సినిమాలు తీశాడు వర్మ. తాను తీయడమే కాదు.. శిష్యుడు పూరినీ.. బిగ్ బీకి పరిచయం చేసి, ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ చేసి పెట్టాడు. ఇప్పుడు వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ఓ సినిమా చేయబోతున్నాడన్నది ముంబై పత్రికల టాక్. ఇది వరకే... బిగ్ బీకి.. కథంతా చెప్పేశాడట. దానికి బచ్చన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందని టాక్. ఈ సినిమాతో అయినా.. వర్మ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.