పిల్లల్ని కంటాం.. వాళ్ల తలరాతల్ని కాదు. చిన్నప్పుడు ఎంత ప్రేమ పంచినా - పెద్దయ్యాక.. ఆ ప్రేమ వాళ్లు తిరిగి ఇవ్వకపోవొచ్చు. రెక్కలొచ్చాక.. గూడు వదిలిపోవొచ్చు. `అసలు మీరెవరు` అంటూ నిలదీయనూ వచ్చు. ఓ తండ్రికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అల్లారు మద్దుగా పెంచిన కన్న కూతురు.. ఎవరినో ప్రేమించింది. `ఇది తప్పు కదా` అని అడిగితే... ఆ తండ్రినే ఎదిరించింది. ప్రేమ కోసం.. కని పెంచిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది. ఆ కథని.. `మర్డర్`లో చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారత దేశంలోనే సరికొత్త చర్చకు తావిచ్చిన ఓ పరువు హత్య నేపథ్యంలో రాంగోపాల్ వర్మ నిర్మించిన సినిమా ఇది.
పరువు హత్య నేపథ్యంలో సాగినా.. దీనికి `కుటుంబ కథా చిత్రమ్` అనే ట్యాగ్ లైన్ తగిలించాడు వర్మ. ఇది ప్రణయ్ - అమృత గాథ అని అందరికీ తెలిసిందే. అయితే.. వర్మ స్టాండ్ మారుతీరావుపైనా, అమృత వైపా అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ని బాగా కట్ చేశాడు. ఎమోషన్స్‌ని పీక్ స్టేజ్‌లో చూపించాడు. వర్మ మార్కు కెమెరా వర్క్ కొన్ని చోట్ల కనిపించింది. మరి.. మర్డర్ తో వర్మ సక్సెస్ కొడతాడా? లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.