ఆటాడించేస్తానంటోన్న రష్మికా మండన్నా.!

By iQlikMovies - December 12, 2018 - 12:38 PM IST

మరిన్ని వార్తలు

తొలి సినిమా 'ఛలో'తోనే క్రేజీయెస్ట్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది రష్మికా మండన్నా, ఇక 'గీత గోవిందం' సినిమాతో రికార్డులు కొల్లగొట్టేసింది. తాజాగా విజయ్‌ దేవరకొండతో 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో రష్మికా క్రికెటర్‌ పాత్ర పోషిస్తోందనీ సమాచారమ్‌. పల్లెటూరి వాతావరణంలో రూపొందుతోన్న చిత్రమిది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాలో ఎక్కువ భాగం చిత్రీకరించనున్నారు.

కాగా 'గీతగోవిందం'లో గీతగా హీరోకి ధీటైన పాత్ర పోషించిన ఈ క్రేజీ బ్యూటీ ఇప్పుడు క్రికెటర్‌గా తన సత్తా ఎలా చాటబోతోందో చూడాలిక. భరత్‌ కమ్మ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ బ్యానర్‌లో సినిమా రూపొందుతోంది. దాదాపు 60శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది 'డియర్‌ కామ్రేడ్‌'. టైటిల్‌ని బట్టి ఇదేదో అన్నల సినిమా అనుకుంటే పొరపాటే. ప్యూర్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.

'అర్జున్‌రెడ్డి'తో తెలంగాణా కుర్రోడిగా సత్తా చాటిన విజయ్‌ దేవరకొండ ఈ సినిమాలో అచ్చమైన ఆంధ్రా కుర్రోడిలా కనిపించబోతున్నాడు. పక్కా గోదారి యాసలో డైలాగులు పలకనున్నాడు. ఇంతవరకూ పక్కా తెలంగాణా యాసలోనే మాట్లాడి ఇదే తన రియల్‌ అండ్‌ రీల్‌ ఆటిట్యూడ్‌ అని చాటి చెప్పిన విజయ్‌ దేవరకొండ సడెన్‌గా ఆంధ్రా కుర్రోడి అవతారమెత్తేశాడు ఈ సినిమా కోసం. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS