తెలుగు పాఠక లోకానికి హారర్ నవలల్ని పరిచయం చేసిన ఘనత... యండమూరి వీరేంద్రనాథ్ కి దక్కుతుంది. ఆయన రచించిన తులసిదళం.. సూపర్ హిట్ అయ్యింది. ఆ నవల ఆధారంగా సినిమా కూడా తీశారు. ఇప్పుడు తులసిదళంకి సీక్వెల్ గా తులసి తీర్థం అనే నవల రాశారు యండమూరి. దాన్ని కూడా ఇప్పుడు సినిమాగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తుండడం విశేషం.
యండమూరి పాఠకులకు హారర్ నవలల్నిపరిచయం చేస్తే, వర్మ తెలుగు ప్రేక్షకులకు హారర్ సినిమాల్ని పరిచయం చేశాడు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే.. ఇది నిస్సందేహంగా రేర్ కాంబినేషనే. ఈ చిత్రానికి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ నిర్మాత. ఈ రోజు ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ కూడా విడుదలైంది. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో ప్రకటిస్తార్ట. ``నన్ను ఓ పాఠకుడిగా ప్రభావితం చేసిన నవలల్లో.. తులసిదళం ఒకటి. ఆ నవల రచించిన యండమూరితో పనిచేయడం ఆనందంగా ఉంది`` అని వర్మ చెబుతున్నాడు. మరి ఈ అరుదైన కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ హారర్ సినిమా ఎలా ఉండబోతోందో?