ఓటీటీ లోకి ఎంటర్ అవుతున్న రామ్

మరిన్ని వార్తలు

ప్రస్తుత కాలంలో OTT లు, వెబ్ సిరీస్ లకి ఆదరణ పెరిగింది. ఫేడ్ అవుట్ అయిపోయినవారు, అవకాశాలు తగ్గినవారు వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతున్నారు. క్రమక్రమంగా వీటికి పాపులారిటీ పెరగటంతో ఇప్పుడు స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ లలో నటించటానికి మొగ్గు చూపుతున్నారు. సినిమా కథ రెండున్నర గంటలకి మించి ఉంటే చూడరు, బడ్జెట్ లెక్కలు కూడా మారిపోతాయి. అదే వెబ్ సిరీస్ అయితే మినిమమ్  పది ఎపిసోడ్స్, ఒక్కో ఎపిసోడ్ 40 మినిట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. దీనితో కథకి, నటనకి కావాల్సినంత స్కోప్ ఉంటోంది. హిట్ అయితే పార్ట్ 2, పార్ట్ త్రీ అని కొనసాగింపు ఉంటోంది.  పైగా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుండటంతో పాన్ ఇండియా లెవెల్ గుర్తింపు దక్కుతుంది.  ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, సోలోగా ఉండే వారికి కూడా ఈ వెబ్ సిరీస్ లు మంచి టైమ్ పాస్ అవుతున్నాయి. 


అందుకే మన హీరోలు, హీరోయిన్స్ ఓటీటీ ఎంట్రీకి  ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ ఓటిటి ఎంట్రీ ఇవ్వగా ఇప్పుడు ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రానా నాయుడు తరహాలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ రామ్‌తో ఒక వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నట్టు,  భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు  అన్నీ సిద్ధం చేససినట్టు సమాచారం. ఇందుకోసం ఇద్దరు ముగ్గురు దర్శకులను లైన్లో పెట్టినట్టు టాక్. ఇక రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే లేట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ పూరి జగన్నాథ్ తో డబల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. నెక్స్ట్ రామ్ ఎలాంటి ప్రాజెక్ట్ కమిట్ అవలేదు. దీనితో కథ నచ్చితే వెబ్‌ సిరీస్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని రామ్  చెప్పినట్టుగా సమాచారం.
 

ఇప్పటికే రానా నాయుడు వెబ్ సిరీస్ తో వెంకటేష్, రానా సాలిడ్ హిట్ కొట్టగా, దూత వెబ్ సిరీస్ తో నాగ చైతన్య బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. నవీన్ చంద్ర సినిమాలకంటే వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. హీరోయిన్స్ లో తమన్నా, రాశి ఖన్నా, కాజల్, సమంత  లాంటి స్టార్ హీరోయిన్స్ వెబ్ సిరీస్ లతో సత్తా చాటుతున్నారు.  భవిష్యత్తులో మరి కొందరు స్టార్స్ వెబ్ సిరీస్ ల్లో నటించటానికి ముందుకు వస్తారేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS