'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రామ్, తదుపరి కిషోర్ తిరుమల సినిమాలో నటించనున్నాడు. 'నేనే శైలజ' సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఆ తర్వాత 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమాతో కాస్త నిరాశపరిచినా, ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లనుంది. దసరాకి పట్టాలెక్కనున్న ఈ సినిమా కోసం రామ్ కఠినంగా కసరత్తులు చేస్తున్నాడు.
ఇంతకీ రామ్ చేస్తున్న ఆ కసరత్తుల కథా కమామిషు ఏంటయ్యా.. అంటే, 1000 పౌండ్లు అంటే దాదాపు 450 కేజీలన్న మాట. ఇంత వెయిట్‌ని తన కాళ్లపై ప్రెస్ చేస్తూ ఓ ఫీట్ చేశాడు. ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తన 18వ సినిమా కోసం ఈ ఫీట్ చేస్తున్నాను.. అంటూ 'ర్యాపో ఎట్ 18' అనే హ్యాష్ ట్యాగ్ కూడా జత చేశాడు. కిషోర్ తిరుమలతో రామ్ నటించిన రెండు సినిమాలూ హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీస్. అలాగే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్స్ కూడా. అయితే ఈ సారి పూర్తిగా భిన్నమైన స్టోరీ ఎంచుకున్నాడట.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ ఉండబోతోందట. 'ఇస్మార్ట్ శంకర్'తో తనకున్న మాస్ ఇమేజ్‌కి మరీ ఎక్కువ డోస్‌లో మసాలా దట్టించేసి, మాస్ ఇమేజ్‌లో తనను కొట్టేవాడు లేడన్నంత బిల్డప్ క్రియేట్ చేసుకున్న రామ్‌కి తాజా చిత్రం ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో తెలీదు కానీ, ప్రస్తుతం రామ్ చేసిన ఫీట్ మాత్రం ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా ఉంది.