ఇస్మార్ట్‌ శంకర్‌' ఇడియట్‌'ని మించిపోతాడా.?

మరిన్ని వార్తలు

పూరీ జగన్నాధ్‌ సినిమాల్లో హీరో ఎలా ఉంటాడనేది ఇప్పటికే అందరికీ ఓ ఐడియా ఉంది. కొత్త హీరో, పాత హీరో, స్టార్‌ హీరో, యంగ్‌ హీరో అనే తేడాలేం లేవు. అందరిదీ ఒకే ఆటిట్యూడ్‌ అంతే. ఇకపోతే పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన 'ఇడియట్‌' సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకుని తీరాలి. 

 

'ఏ కమీషనర్‌ కూతుళ్లకు మొగుళ్లు రారా.? చంటిగాడు లోకల్‌..' ఇలాంటి డైలాగులు చెప్పించడం పూరీ జగన్నాధ్‌కే సెట్టయ్యింది. ఇడియట్‌ అనే కాదు, కొత్త హీరోతో తెరకెక్కించిన 'రోగ్‌'లోనూ హీరోకి ఇదే ఆటిట్యూడ్‌ని చూపించాడు పూరీ జగన్నాధ్‌. ఇదిలా ఉంటే, తాజాగా పూరీ జగన్నాధ్‌ యంగ్‌ హీరో రామ్‌తో 'ఇస్మార్ట్‌ శంకర్‌' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో రామ్‌ ఆటిట్యూడ్‌ పీక్స్‌లో ఉండబోతోందట. 

 

అచ్చం 'ఇడియట్‌'లో రవితేజని పోలి ఉంటుదని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ నడుస్తోంది. ఆల్రెడీ గెటప్‌ పరంగా ఫస్ట్‌లుక్‌ చూస్తే ఓ ఐడియా వచ్చేసింది. ఇక యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని చాలా చాలా కొత్తగా డిజైన్‌ చేస్తున్నాడట పూరీ. సినిమాలో కొంత భాగం విదేశాల్లో షూటింగ్‌ జరుగుతుందట. టెక్నికల్లీ మాంచి సౌండింగ్‌తో ఈ సినిమాని రూపొందించనున్నాడట పూరీ జగన్నాధ్‌. చూడాలి మరి 'ఇడియట్‌' మ్యాజిక్‌ని 'ఇస్మార్ట్‌ శంకర్‌' రిపీట్‌ చేస్తుందో లేదో.!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS