కొరటాల కోసం చిరు కష్టం తప్పదేమో.!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే చిత్రం కోసమే ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ హాట్‌గా చర్చలు జరుగుతున్నాయి. కొరటాల సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఒక సోషల్‌ మెసేజ్‌ ఉంటుంది. దాంతో పాటు స్క్రీన్‌ప్లే చాలా స్టైలిష్‌గా రిచ్‌గా ఉంటుంది కూడా. అయితే చిరంజీవి విషయానికి వస్తే, 'సైరా' సినిమా కోసం ఫిట్‌నెస్‌ పెద్దగా అవసరం లేకుండాపోయింది చిరంజీవికి. 

 

కానీ కొరటాల శివ సినిమా కోసం చిరంజీవి ఫిట్‌గా తయారవనున్నారట. 15 కిలోల వరకూ బరువు తగ్గాల్సి వస్తుందని చిరంజీవి భావిస్తున్నారట. 'సైరా' షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యాక ఈ సినిమా కోసం కసరత్తులు మొదలుపెడతారట చిరంజీవి. కోడలు ఉపాసన రూపంలో చిరంజీవికి మంచి డైటీషియన్‌ ఎలాగూ అందుబాటులో ఉన్నట్లే. చరణ్‌కి 'వినయ విధేయ రామ' టైంలో ఉపాసన అందించిన డైట్‌ ఫలితం స్క్రీన్‌పై యాక్షన్‌ సీన్స్‌లో కండలు తీరిన శరీరంతో రామ్ చరణ్‌ని ఎలా చూపించిందో అందరికీ తెలిసిందే.

 

ఇప్పుడు మామగారి టైం వచ్చింది. చరణే కాదు, సినిమా కోసం చిరంజీవి కూడా ఎంత కష్టపడడానికైనా వెనుకాడరు. ఆ మాటకొస్తే, వయసును కూడా లెక్క చేయరు. ఇక మరోవైపు చిరంజీవి కోసం పవర్‌ఫుల్‌ డైలాగులు రాసే పనిలో కొరటాల బిజీగా ఉన్నాడు. స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధం కాగా, కథలో చిన్న చిన్న మార్పులు చిరంజీవి సూచన మేరకు జరుగుతూనే ఉన్నాయట. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS