'ఇస్మార్ట్ శంకర్'తో యంగ్ హీరో రామ్ పూర్తిగా మారిపోయాడు. నిజానికి రామ్ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే రామ్. చాక్లెట్ బోయ్‌లా కనిపించినా, మాస్ ఇంపాక్ట్ చూపించడానికే ట్రై చేశాడింతవరకూ. కానీ, 'ఇస్మార్ట్ శంకర్' మాత్రం రామ్‌కి సరికొత్త ఇమేజ్ తెచ్చిపెట్టింది. దాంతో పాత ఇమేజ్‌కి పూర్తిగా చెల్లు చీటీ పాడేసి, కొత్త ఇమేజ్‌ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాడట. ఆ కోవలోనే తాజా చిత్రానికి కూడా రామ్ డిఫరెంట్ లుక్‌లోనే కనిపిస్తున్నాడు. రామ్ తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ని బట్టి, ఇది కూడా 'ఇస్మార్ట్ శంకర్' టైప్ మాస్ అండ్ రగ్గ్డ్ మూవీలానే అనిపిస్తోంది. ఈ సినిమాకి 'రెడ్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. రామ్ తనతో పాటు, తన డైరెక్టర్ కిషోర్ తిరుమలని కూడా మార్చేసినట్లు కనిపిస్తోంది. కిషోర్ తిరుమల అంటే, కూల్ అండ్ లవ్లీ రొమాంటిక్ స్టోరీస్‌ని తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు. అలాంటిది ఆయన్ని కూడా రామ్ తన ట్రాక్‌లోకి తెచ్చేశాడు. గతంలో కిషోర్‌తో రామ్ నటించిన రెండు సినిమాలూ కూల్ రొమాంటిక్ మూవీసే. కానీ, ఈ స్క్రిప్టు కొత్తగా ఉండబోతోందట.
హీరోయిన్, తదితర వివరాలు ఇంకా తెలీదు కానీ, ఈ సినిమా రామ్ సొంత బ్యానర్లో రూపొందుతోంది. స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 'ఇస్మార్ట్' మ్యూజిక్ అందించిన మణిశర్మ ఈ సినిమా కోసం మళ్లీ రామ్‌తో కలిసి వర్క్ చేస్తున్నారు. నవంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.