బిగ్‌బాస్‌ ఇంట్లో సుమ.. ఎంటర్‌టైన్‌మెంట్‌ పైసా వసూల్‌.!

మరిన్ని వార్తలు

చివరి వారం స్టార్టింగ్‌ డే అయిన సోమవారం బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రత్యేకమైన గెస్ట్‌ సందడి చేసింది. ఎవరా ప్రత్యేకమైన గెస్ట్‌ అంటే పంచ్‌ల లేడీ సునామీ, ఎంటర్‌టైన్‌మెంట్‌కా మామ్‌ సుమ. సుమ సందడితో హౌస్‌కి కొత్త కళ వచ్చింది. హౌస్‌ అంతా కలియ దిరిగింది. మధ్య మధ్యలో కంటెస్టెంట్స్‌కి పంచ్‌లు వడ్డిస్తూ తెగ సందడి చేసింది. హౌస్‌లో ప్రస్తుతం ఐదుగురు కంటెస్టెంట్స్‌ మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఐదుగురికి సంబంధించి మేకప్‌ కిట్స్‌ దగ్గర నుండి, కిచెన్‌ ఐటెమ్స్‌, బెడ్రూమ్‌, బాత్రూమ్‌ వగైరా అన్నింటినీ వదిలిపెట్టకుండా, చూపించింది.

 

తాను ఒక యాంకర్‌గా, సెలబ్రిటీగా, గెస్ట్‌గా రాలేదనీ, సామాన్య ప్రేక్షకురాలిగా, సగటు ప్రేక్షకులకున్న కొన్ని కొన్ని డౌట్స్‌ తీర్చేందుకే హౌస్‌లోకి వచ్చానని చెప్పింది. ఎక్కువ సేపే సుమ హౌస్‌లో ఉంది. వారితో ఆడింది, పాడింది. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లు కొన్ని చేయించింది. సుమ కోసం స్పెషల్‌గా మటన్‌ బిర్యానీ వండి వడ్డించారు హౌస్‌మేట్స్‌. అన్నట్లు ప్రత్యేకించి రాహుల్‌ బెడ్‌ చూడాలని కోరింది సుమ. రాహుల్‌ బెడ్‌ పక్కన ఏమేం సీక్రెట్స్‌ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంది.

 

ఊహించినట్లుగానే, రాహుల్‌ బెడ్‌ వద్ద పునర్నవి వాడిన పర్‌ఫ్యూమ్‌ బాటిల్‌, ఆమె హెయిర్‌ క్లిప్‌, సాక్స్‌, బ్యాటరీ.. తదితర ఐటెమ్స్‌ భద్రంగా ఓ కవర్‌లో పెట్టి కనిపించాయి. అయితే, అవి తాను దాచుకోలేదని, ఆమె గుర్తుగా శ్రీముఖి తన బెడ్‌ వద్ద ఉంచిందనీ తెలిపాడు రాహుల్‌. అది నిజమే అని ఒప్పుడుకుంది శ్రీముఖి. అలా తాజా బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ సుమ రాకతో సరదా సరదాగా సాగింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS