మాస్ ఇమేజ్ ఉన్న హీరో రామ్ పోతినేని. చాక్లెట్ బోయ్‌లా కనిపిస్తూనే, ప్రత్యేకమైన మాస్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నాడు. అయితే, 'ఇస్మార్ట్ శంకర్' రామ్‌లోని వేరే యాంగిల్‌ని బయటికి తీసుకొచ్చింది. రామ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా.? అని ఆశ్చర్యపోయేంతలా మేకోవర్ చూపించాడు ఆ సినిమాతో. ఇక ఇప్పుడు అదే ఆటిట్యూడ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నాడేమో కానీ, తదుపరి సినిమా కోసం కూడా విలక్షణంగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్స్ పోజిటివ్ రెస్పాన్స్ అందుకుంటున్నాయి.
సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ బ్యానర్‌లో కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్న ఈ సినిమాని వెరీ లేటెస్ట్‌గా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. తనకు ఇస్మార్ట్ హిట్ ఇచ్చిన పూరీ జగన్నాధ్, ఛార్మి ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా విచ్చేశారు. పూరీ క్లాప్ కొట్టడంతో, రామ్ కొత్త సినిమా ప్రారంభమైంది. కిషోర్ తిరుమల - రామ్ కాంబినేషన్‌లో ఆల్రెడీ రెండు సినిమాలొచ్చాయి. ముచ్చటగా మూడో సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం కిషోర్ తిరుమల ఓ తమిళ రీమేక్‌ని చూజ్ చేసుకున్నారు.
ఈ సినిమాకి 'రెడ్' అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. రామ్ కోసం ఒరిజినల్‌లో చాలా మార్పులు చేశారట. ఇక కథ విషయానికి వస్తే, ఇదో థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. ఇంతవరకూ కమర్షియల్ ఫిలింస్‌లోనే కనిపించిన నేను, కెరీర్‌లో ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ జోనర్‌ని కనిపించబోతున్నాననీ, ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలనీ.. ఈ సందర్భంగా రామ్ మీడియాతో చెప్పారు.