త‌మిళ రీమేక్‌లో రామ్‌..?

మరిన్ని వార్తలు

త‌మిళం నుంచి క‌థ‌ల్ని అరువు తెచ్చుకోవ‌డం మ‌న హీరోల‌కేం కొత్త కాదు. ప్ర‌స్తుతం కొంత‌మంది యువ హీరోల దృష్టి ఓ త‌మిళ సినిమాపై ప‌డింది. అదే... 'త‌థ‌మ్‌'. అరుణ్ విజ‌య్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈచిత్రం ఇటీవ‌లే విడుద‌లై మంచి విజ‌యాన్ని అందుకుంది. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ సినిమా రామ్ చేసే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది.

 

స్ర‌వంతి మూవీస్ సంస్థ ఈ రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకుంద‌ని స‌మాచారం. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రామ్ - కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో ఇది వ‌ర‌కు రెండు సినిమాలొచ్చాయి. నేను శైల‌జ హిట్ అయితే, ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ యావ‌రేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌త క‌ట్ట‌బోతున్నార‌న్న‌మాట‌. ప్ర‌స్తుతం రామ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్త‌యిన త‌ర‌వాత ఈ రీమేక్ ప‌ట్టాలెక్కొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS