'ఇస్మార్ట్‌ శంకర్‌' టీజర్‌ అదిరిపోయింది!

By iQlikMovies - May 13, 2019 - 19:00 PM IST

మరిన్ని వార్తలు

అదేంటీ 'ఇస్మార్ట్‌ శంకర్‌' టీజరా.? ఎప్పుడొచ్చింది.? ఎక్కడొచ్చింది.? అంటూ ఎక్కడెక్కడో సెర్చ్‌ కొట్టేయకండి. కాస్త ఆగి మేం చెప్పేది వినండి. టీజర్‌ ఇంకా విడుదల కాలేదు. మరో రెండు రోజుల్లో రిలీజ్‌ కానుంది. కానీ, ఆల్రెడీ టీజర్‌ చూసిన నటుడు సత్యదేవ్‌ ఈ మాటలు సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈయన గతంలో పూరీ జగన్నాధ్‌తో కలిసి 'జ్యోతిలక్ష్మీ' చిత్రంలో నటించారు.

 

అప్పటి నుండీ, పూరీతో, హీరోయిన్‌ కమ్‌ నిర్మాత అయిన ఛార్మితో సత్యదేవ్‌కు మంచి స్నేహం ఉంది. ఇకపోతే తాజాగా 'ఇస్మార్ట్‌ శంకర్‌' టీజర్‌ వీక్షించిన ఈయన ముందుగానే ఫ్యాన్స్‌కి ప్రామిస్‌ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ టీజర్‌ అందరికీ నచ్చుతుందని. రామ్‌ ఎనర్జీకి, పూరీ టేకింగ్‌ పిచ్చెక్కించేలా ఉందనీ, ఈ సినిమాలో రామ్‌ 'చెడుకు పర్యాయపదంలా ఉన్నాడనీ' ఆయన అభివర్ణించారు. ఇంతకీ టీజర్‌ ఎప్పుడొస్తుందా.? అంటే, ఈ నెల 15న హీరో రామ్‌ పుట్టినరోజు సందర్భంగా అదే రోజు ఈ టీజర్‌ని విడుదల చేయనున్నారు. సత్యదేవ్‌ చెప్పిన మాటలకు టీజర్‌పై అప్పుడే ఎక్స్‌పెక్టేషన్స్‌ మొదలైపోయాయి.

 

ఒకప్పుడు పూరీ జగన్నాధ్‌ అంటే ఓ రేంజ్‌ ఉండేది. కానీ, ప్రస్తుతం పూరీపై ఫ్యాన్స్‌కి అంతగా నమ్మకం లేదు. ఆ నమ్మకం మళ్లీ తిరిగి రావాలంటే, 'ఇస్మార్ట్‌ శంకర్‌'తోనే ప్రూవ్‌ కావాలి. మరి పూరీ అది ప్రూవ్‌ చేసుకుంటారో లేదో చూడాలి మరి. పూరీ కనెక్ట్స్‌ బ్యానర్‌లో ఛార్మి, పూరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సమ్మర్‌లోనే 'ఇస్మార్ట్‌ శంకర్‌' ఇస్మార్ట్‌ రిలీజ్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS