తెలుగు సినీ పరిశ్రమలో సిక్స్ ప్యాక్ ట్రెండ్‌కి శ్రీకారం చుట్టిన హీరోగా అల్లు అర్జున్‌ని చెప్పవచ్చు. ఆ తర్వాత నితిన్ సహా ఎందరో హీరోలు సిక్స్ ప్యాక్ చేశారు. కొత్త హీరోలైతే సిక్స్ ప్యాక్‌తో సినీ రంగంలోకి రావాలనుకుంటున్నారు కూడా. సీనియర్ హీరోల్లో నాగార్జున సిక్స్ ప్యాక్ లాంటి ఫిజిక్ 'ఢమరుకం' సినిమా కోసం ట్రై చేశాడు. తాజాగా హీరో రామ్ తన కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ ఫిజిక్ ట్రై చేస్తున్నాడు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమాలోనే రామ్ సిక్స్‌ప్యాక్ ఫిజిక్‌తో కనిపించనున్నాడట. ఈ సినిమా కోసమే రామ్ కొంత బ్రేక్ తీసుకుని ఫిజిక్‌ని మౌల్డ్ చేసుకున్నాడు. గడ్డం పెంచి డిఫరెంట్ లుక్స్ కూడా ట్రై చేశాడు. కంప్లీట్ మేకోవర్‌తో రెడీ అయిపోయిన రామ్ త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళతాడు. స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. అందాల భామ అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుంది. యాక్షన్ అండ్ ఎంటర్‌టైనింగ్ లవ్ స్టోరీని కిషోర్ తిరుమల, రామ్ కోసం రెడీ చేశాడని సమాచారమ్. తెలుగు సినీ పరిశ్రమలో డాన్సులు బాగా చేసే హీరోల్లో రామ్ కూడా ఉంటాడు. డాన్సుల్లో మేటి అయిన రామ్, ఈ సినిమాతో తెలుగు తెరకు కొత్త తరహా డాన్సులు పరిచయం చేస్తాడట. యాక్షన్ కూడా చాలా స్టైలిష్‌గా ఉండేలా ఈ చిత్రాన్ని డిజైన్ చేయనున్నారని సమాచారమ్.