మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో సీనియర్ భామల పాత్రల చిత్రీకరణ ప్రత్యేకంగా ఉంటుంది. ఆ పాత్రలతో వారికి మంచి గుర్తింపు కూడా దక్కుతుంది. 'అత్తారింటికి దారేది' చిత్రం నుండీ త్రివిక్రమ్ ఈ ఫార్ములా ఫాలో అవుతున్నాడు. తద్వారా సీనియర్ ముద్దుగుమ్మలకు మంచి ప్లాట్‌ఫామ్ దొరుకుతోంది. ఆ లిస్టులో నదియా, స్నేహ, కుష్బూ మంచి పేరు తెచ్చుకున్నారు. త్రివిక్రమ్ తాజాగా ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ఓ సీనియర్ భామని ఎంచుకున్నాడట. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోన్న రంభ, బుల్లితెరపై ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారమవుతున్న డాన్స్ ప్రోగ్రాంకి జడ్జ్‌గా వ్యవహరించింది. హీరోయిన్‌గా ఒకప్పుడు తన గ్లామర్‌తో, డాన్సులతో కుర్రకారును కెవ్వుకేక పుట్టించింది రంభ, స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. అంతేకాదు, ఎన్టీఆర్‌తోనే రెండు స్పెషల్ సాంగ్స్‌లో నటించింది. తాజాగా ఫుల్ లెంగ్త్ అండ్ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించడానికి ముస్తాబవుతోందట.
మనసుకు నచ్చిన మంచి క్యారెక్టర్స్ వస్తే, తప్పకుండా నటిస్తానని అందాల రంభ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. బహుశా ఆ మనసుకు నచ్చిన పాత్ర ఈ సినిమా ద్వారా రంభకు దక్కింది కాబోలు. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఈ సినిమా సెట్స్‌లోకి రంభ త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుందని తాజా సమాచారమ్. ఒకవేళ సినిమా విజయం సాధిస్తే, రంభకు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇక తిరుగే ఉండదు. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.