మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ రానుందన్న సంగతి రివీల్ అయిన నాటి నుండీ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సెన్సేషనే అవుతోంది. అవును మరి, మెగా మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ఇది. దర్శక ధీరుడు రాజమౌళి 'బాహుబలి' వంటి సెన్సేషనల్ విజయం తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం కూడా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటేస్తున్నాయి.
ఇకపోతే, ఈ ప్రాజెక్ట్ వార్తల్లోకెక్కిన తర్వాత, ఈ వార్త చుట్టూ పలు గాసిప్స్ చక్కర్లు కొడుతున్న మాట వాస్తవమే. ఇటు చరణ్ అభిమానులు, అటు ఎన్టీఆర్ అభిమానులు తమకు నచ్చిన విధంగా గాసిప్స్ క్రియేట్ చేస్తూ, తమ అభిమాన హీరో ఇలా కనిపించబోతున్నాడట. అలా కనిపించబోతున్నాడట అంటూ కొత్త కొత్త గాసిప్స్ పుట్టించేస్తున్నారు. నిన్న మొన్నటి దాకా చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బాక్సర్స్‌లా నటిస్తున్నారనే గాసిప్ తొలుత బయటికొచ్చింది.
ఇద్దరూ అన్నదమ్ముల్లా నటిస్తున్నారట అనే మరో గాసిప్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ రెండు గాసిప్స్‌నీ చరణ్, ఎన్టీఆర్ ఖండించేయడంతో అక్కడ ఫుల్ స్టాప్ పడింది. అయితే చరణ్ పోలీసాఫీసర్‌గానూ, ఎన్టీఆర్ గ్యాంగ్‌స్టర్ పాత్రలోనూ కనిపించబోతున్నారట అనే గాసిప్ ఇప్పుడు వేడి వేడిగా చక్కర్లు కొడుతోంది. పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునే ప్రయత్నంలో ఓ తెలివైన పోలీసాఫీసర్ ఎంత చాకచక్యంగా వ్యవహరించాడన్నదే ఈ చిత్ర కథట.
ఇద్దరు స్టార్ హీరోలకు ఈక్వెల్ వెయిట్ ఇస్తూ, స్క్రిప్టు ప్రిపేర్ చేస్తున్నాడట రాజమౌళి. మరి ఈ తాజా గాసిప్‌లో నిజమెంతుందో ఏమో తెలీదు కానీ, చరణ్, ఎన్టీఆర్ తమ తమ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉండగా, రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు.